గుర్గావ్లో మూడో అంతస్తు నుండి దూకి మహిళ ఆత్మహత్య
రిపోర్టర్: కిరణ్
స్థలం: Gurgaon
హర్యానా రాష్ట్రం గుర్గావ్ జిల్లా సోహ్నా ప్రాంతంలో ముప్పై ఏళ్ల దీప అనే వివాహిత భర్త వేధింపులు తాళలేక భవనం మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భర్త జితేంద్ర నిత్యం మద్యం తాగి స్నేహితుల ముందు తనను అవమానిస్తూ, శారీరకంగా హింసిస్తున్నాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.