సత్యవేడులో జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డికి ఘన సన్మానం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సత్యవేడు

సత్యవేడు మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కురపాటి శంకర్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు పరుచూరి శివకుమార్ పాల్గొని ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జెడ్పీటీసీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ ఆత్మీయతను చాటుకున్నారు.