మహిళలకు రాజకీయాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ డిమాండ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
రాజకీయాల్లో మహిళలు పెద్దఎత్తున ముందుకు రావాలని, చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే వారికి సముచిత ప్రాధాన్యత లభిస్తుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్పష్టం చేశారు. మహిళా సాధికారత కోసం పకడ్బందీ చర్యలు చేపట్టాలని పేర్కొంటూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.