ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా షేక్ ఖాదరున్నిస నామినేషన్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆత్మకూరు
ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్ ఖాదరున్నిస ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ సంఖ్యలో మహిళలతో కలిసి ఘనంగా ర్యాలీ నిర్వహించి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.