నిమజ్జన ఘాట్ల వద్ద పారిశుద్ధ్య లోపం ఉండొద్దన్న డిప్యూటీ కమిషనర్
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
మియాపూర్ సర్కిల్ పరిధిలోని వినాయక నిమజ్జన ప్రాంతాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డీవైఈఈతో కలిసి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ నిమజ్జన ఘాట్ వద్ద జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ, భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యర్థాల తొలగింపునకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని శ్రీనివాస్ సిబ్బందిని ఆదేశించారు.