భారీ వర్క్‌లోడ్ ఆందోళన: కివీస్ ఆటగాళ్ల అలసటపై కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆవేదన
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
భారత్ తో సిరీస్ ల నేపథ్యంలో కివీస్ ఆటగాళ్లపై తీవ్రమైన పనిభారం పడుతోందని ఆ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతర ప్రయాణాలు, రాత్రి వేళల్ లో మ్యాచ్ ల వల్ల ఆటగాళ్లు తీవ్ర అలసటకు గురవుతున్నారని, ఈ పరిస్థితుల్ లో త్వరగా కోలుకోవడం సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా ప్రతి మ్యాచ్ లోనూ అత్యుత్తమ తుది జట్టును బరిలోకి దించడం కష్టసాధ్యంగా మారిందని స్పష్టం చేశారు.