బెంగళూరు ఐటీ రంగంలో కలకలం: స్థానికులకు ఉద్యోగాలంటూ డీకే శివకుమార్ హెచ్చరిక

రిపోర్టర్: రమేష్ స్థలం: బెంగళూరు

కర్ణాటకలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందేనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కన్నడిగులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని ఐటీ కంపెనీలకు ఆయన గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు కోటా అంశంపై బెంగళూరులో మళ్లీ రాజకీయ వివాదం ముదురుతోంది. ఏఐ రాకతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న తరుణంలో స్థానికులు, వలసదారుల మధ్య పోటీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.