సంస్కృతి పరిరక్షణే మన ఉనికికి పునాది: సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయవాడ
అభివృద్ధి, సంక్షేమంతో పాటు మన సంస్కృతి పరిరక్షణే మన ఉనికికి అసలైన పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో భాగంగా మంగళవారం ఆయన మెగా కార్నివాల్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రగతి కోసం టెక్నాలజీ ఎంత అవసరమో, ఆ ఒత్తిడిని పోగొట్టడానికి ఆధ్యాత్మికత కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ప్రపంచమంతా విజయవాడ వైపు చూసేలా ఉత్సవ్ 3.0 నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.