తుఫాన్ ప్రభావంతో ఒమ్మంగి శరభవరం రహదారి మూసివేత

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: ప్రత్తిపాడు

తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి శరభవరం రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రహదారిపై వర్షపు నీరు చేరి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా రాకపోకలను నిలిపివేసినట్లు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం, తహశీల్దార్ ఎం సూర్యప్రభ, ఎంపీడీవో ఎంవీఆర్ కుమార్ బాబు తెలిపారు. ఒమ్మంగి నుంచి శరభవరం వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని అధికారులు కోరారు.