ఫిట్నెస్ ఛేంజ్ లో భాగం కావాలంటూ సైబరాబాద్ సీపీ పిలుపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛేంజ్ లో భాగంగా నగర ప్రజలు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఉత్సాహంగా పాల్గొని తమ వర్కవుట్ లేదా క్రీడా వీడియోలను సామాజిక మాధ్యమాలలో పంచుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ పిలుపునిచ్చారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ఇతరులను కూడా శారీరక దారుఢ్యంపై చైతన్యవంతం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన కోరారు.