ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సదస్సుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి ఆహ్వానం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ ఏడు, ఎనిమిది మరియు తొమ్మిది తేదీలలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సదస్సుకు హాజరుకావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు తెలంగాణ సీఎంవో అధికారికంగా వెల్లడించింది. ఈ కీలక సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరియు నూతన అవకాశాలపై చర్చలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.