పులివెందులలో తీవ్ర కలకలం: వైఎస్ జగన్ కాన్వాయ్ను అడ్డగించిన షేక్ దస్తగిరి

రిపోర్టర్: సునీల్ స్థలం: Kadapa

కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి సంచలనం సృష్టించారు. పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కు ఎదురుగా తన స్కార్పియో కారును నిలిపి అడ్డుకోవడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయని, అక్కడికి చేరుకున్న పోలీసులు దస్తగిరిని సురక్షితంగా అక్కడి నుండి తరలించారని అధికారుల వర్గాలు తెలిపాయి.