తెలంగాణలో మళ్లీ ఎనభైల నాటి కరెంట్ కోతలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఎనభైల నాటి ట్రెండ్ నడుస్తోందని, రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతలతో రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని తాము ముందే చెప్పామని, నేడు ప్రతిచోటా విద్యుత్ కోతలు ఉన్నట్లు రోజూ పత్రికల్లో వస్తోందని ఆయన ధ్వజమెత్తారు.