నిరుద్యోగులకు గుడ్ న్యూస్: రెండు వేల పైచిలుకు పోస్టులతో నేడు డీఎస్సీ నోటిఫికేషన్

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తిస్థాయి డీఎస్సీ నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మొత్తం రెండు వేల ఏడెంటా ఇరవై ఒక్క పోస్టుల భర్తీకి ఈ ప్రకటన జారీ కానుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలతో పాటు సొసైటీ పరిధిలోని పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పదవ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.