ముత్యపుపందిరి వాహనంపై బాలకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి

రిపోర్టర్: నరేష్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఇవాళ రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపుపందిరి వాహనంపై బాలకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో వైభవంగా సాగిన ఈ వాహనసేవలో గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. చల్లని ముత్యాల పందిరి కింద కొలువైన శ్రీవారిని దర్శించుకోవడం వల్ల భక్తుల జీవితాల్లో సుఖశాంతులు చేకూరుతాయని పురాణ ప్రశస్తి.