సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లపై స్మగ్లర్ల దాడి: ముగ్గురికి తీవ్ర గాయాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: సిపాహిజాల
త్రిపురలోని ఆశా బారి సరిహద్దు ప్రాంతంలో గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లపై స్మగ్లర్లు కర్రలు, మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారని త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా వెల్లడించారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని, ప్రభుత్వ వాహనం ధ్వంసమైందని తెలిపారు. దేశాన్ని రక్షించే భద్రతా సిబ్బందిపై ఇలాంటి హింసాత్మక దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం స్పష్టం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.