తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది
రిపోర్టర్: విజయ్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే కోట్ల మంది భక్తుల విశ్వాసాలను అడ్డంపెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న ట్యాంకర్లను టీటీడీ బోర్డు నాణ్యతా పరీక్షల్లోనే తిరస్కరించిందని, ఆ నెయ్యిని ప్రసాదాలలో ఉపయోగించలేదని రోజా స్పష్టం చేశారు.