భీమిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా బొత్స అనూష నియామకం
రిపోర్టర్: మహేష్
స్థలం: విశాఖపట్నం
భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషను నియమిస్తూ పార్టీ అధిష్టానం శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరడంతో ఈ ఖాళీ ఏర్పడింది. పార్టీ బలోపేతానికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అనూష తెలిపారు.