నెల్లూరు రూరల్ లో జెన్ జీ యువతకు నాలుగు సీట్లు కేటాయించిన కోటంరెడ్డి
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించే దిశగా టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జెన్ జీ యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నాలుగు సీట్లను ప్రత్యేకంగా కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఈ సీట్లలో పోటీచేసే యువతకు అవసరమైన కనీస ఎన్నికల ఖర్చును తానే భరిస్తానని ఆయన స్పష్టం చేశారు.