పాఠశాలల్ లో నవంబర్ ప్రత్యేక హాజరు డ్రైవ్: ఉత్తమ హెడ్మాస్టర్లకు ప్రత్యేక సన్మానం
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్ లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత నవంబర్ నెల అంతటా పాఠశాలల్ లో వంద శాతం హాజరు నమోదు చేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హాజరు డ్రైవ్ కు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈనెల మొత్తం టీచర్లు, విద్యార్థుల వందశాతం హాజరు సాధించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హెడ్మాస్టర్లను ప్రత్యేకంగా సన్మానించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.