నెల్లూరులో అధిక ధరలకు బియ్యం అమ్మితే వ్యాపారులపై పీడీ యాక్ట్ తప్పదన్న జేసీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు జిల్లాలో బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం గరిష్ట రిటైల్ ధరలను ఖరారు చేసింది. జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల వద్ద తప్పనిసరిగా ధరల పట్టికను ప్రదర్శించాలని ఆయన స్పష్టం చేశారు.