పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
రిపోర్టర్: నరేష్
స్థలం: సూళ్లూరుపేట
సూళ్లూరుపేటను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడూ భాగస్వామ్యం కావాలని సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.