షాకింగ్ ఘటన: ఎనుబది మంది విద్యార్థులకు అరగుండు శిక్ష విధించిన ప్రిన్సిపాల్

రిపోర్టర్: గోపి స్థలం: చంద్రాపూర్

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జంభుల్ఘాట్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో హెయిర్కట్ సమయంలో ఆడుకున్నారనే కారణంతో ఎనుబది మంది విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఆదేశాలతో సగం జుట్టు మాత్రమే కత్తిరించి అరగుండు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై షోకాజ్ నోటీసులు జారీ చేసి సమగ్ర విచారణకు ఆదేశించారు.