వైట్‌హౌస్‌లో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌కు ట్రంప్ ఘన విందు

రిపోర్టర్: శివ స్థలం: Washington

అమెరికాలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ దంపతులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లో వైభవంగా అధికారిక విందు ఇవ్వనున్నారు. ఇరు దేశాల సంప్రదాయాల మేళవింపుతో ఈ ప్రత్యేక విందును రూపొందించినట్లు ప్రథమ మహిళ మెలనియా కార్యాలయం వెల్లడించింది. వైట్‌హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో జరగనున్న ఈ వేడుకకు ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు హాజరుకానున్నారు. చారిత్రక వైన్‌తో పాటు అమెరికన్, చైనీస్ వంటకాల రుచులతో ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు.