సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వైద్యుడు జగదీష్ సజీవ దహనం
రిపోర్టర్: సతీష్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మమత ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్ కారులోనే సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. డాక్టర్ జగదీష్ అకస్మిక మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వైద్య రంగానికి ఇది తీరని లోటని పేర్కొన్నారు.