ఐరాలలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన మహేష్ స్వేరో

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

ఐరాల జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మహేష్ స్వేరో స్థానిక ప్రజల నుంచి మద్దతు కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ కేటాయించిన గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.