ది ప్యారడైజ్ సినిమా నుంచి ఎమోషనల్ పాట విడుదల చేసిన మేకర్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ వీడియో సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఎలాంటి వాయిద్యాలు లేకుండా పచ్చిది నీ పేగు సమ్మక్క అనే పాటను ఎంతో భావోద్వేగంతో ఆలపించారు. తల్లి ఆకలి, కొడుకు కోసం ఆమె పడే వేదనను ఈ పాట వివరిస్తుండటంతో సినిమాలో బలమైన మదర్ సెంటిమెంట్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.