ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
రిపోర్టర్: తాడి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. అమరావతిలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర, నాయకులు ఒమ్మి శ్రీను, నారిండి కొండలరావు, తోట వాసు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని వారిని అభినందించారు.