మోడీ అనే రాక్షసుడిని ఓడించడానికి వానర సైన్యం కదం తొక్కింది
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
మోడీ అనే రావణుడిని ఓడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు వానర సైన్యంలా కదం తొక్కాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టే వరకు విశ్రమించబోమని హెచ్చరించారు. ఓట్ల తొలగింపు ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కార్యకర్తల సంకల్పాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.