ఆసియా క్రీడలలో పతకం కోల్పోయిన భారత షూటింగ్ జంట
రిపోర్టర్: రాము
స్థలం: జపాన్
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్ెడ్ టీమ్ విభాగంలో భారత్ తరఫున బరిలోకి దిగిన ఎలవెన్ ఇల్ వలరివన్ మరియు పార్థ్ మానే జోడీ ఫైనల్ కు అర్హత సాధించినప్పటికీ, తుది పోరులో నాల్గవ స్థానంతో సరిపెట్టుకుని పతసాన్ని చేజార్చుకుంది. వివిధ విభాగాలలో జరిగిన పోటీలలో భారత క్రీడాకారులు బ్యాడ్మింటన్, ఫెన్సింగ్ మరియు టేబుల్ టెన్నిస్ విభాగాలలో తమ ప్రత్యర్థుల చేతిలో పరాజయాలను చవిచూశారు.