నా జీవితంలోని దీపం రాహా మాత్రమేనని వెల్లడించిన నటుడు రణ్బీర్ కపూర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Mumbai
తన జీవితంలో అత్యంత వెలుగునిచ్చే దీపం తన కూతురు రాహా మాత్రమేనని ప్రముఖ నటుడు రణ్బీర్ కపూర్ వెల్లడించారు. లండన్ లో జరిగిన ఒక రేడియో షో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాహా పుట్టినరోజు నవంబర్ ఆరో తేదీన వస్తుందని, ఆమెకు అందరి నుంచి మంచి ఆశీస్సులు, సానుకూల వాతావరణం లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాముడి పాత్రలో నటించడం తన జీవితంలో ఒక పెద్ద మలుపు అని ఆయన స్పష్టం చేశారు.