దారుణం: వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను పెట్రోల్ పోసి హత్య చేసిన భార్య

రిపోర్టర్: అశోక్ స్థలం: నారాయణపేట

నారాయణపేట జిల్లా మరికల్ మండలం మద్వార్ గ్రామంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భర్త బాలస్వామి మరో మహిళతో సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన భార్య రాములమ్మ ఘాతుకానికి పాల్పడింది. గాఢ నిద్రలో ఉన్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలైయ్యాడు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితురాలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.