కొడంగల్ నియోజకవర్గంలో అమ్మ చెరువు భూసేకరణలో చిక్కులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కొడంగల్
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామ శివారులోని అమ్మ చెరువు రిజర్వాయర్ భూ సేకరణ ప్రక్రియలో రికార్డుల చిక్కులు మరియు పరిహారం చెల్లింపుల సమస్యలు తలెత్తినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఐదు వందల పదహారు ఎకరాలకు పైగా భూమిని సేకరిస్తుండగా, శిఖం భూములు మరియు పెండింగ్ పరిహారం విషయాలపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరుతున్నారు.