నేతాజీ నగర్లో నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన
రిపోర్టర్: రాము
స్థలం: Netaji Nagar, Ward 34, Visakhapatnam
విశాఖపట్నం 34వ వార్డు నేతాజీ నగర్లో శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమం స్థానికంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.