అలియాస్ రుక్మిణి చిత్రం నుంచి హీరో నితిన్ పాత్ర వీడియో విడుదల
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
యువ నటుడు నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం అలియాస్ రుక్మిణి నుంచి కృష్ణ పాత్ర తాలూకు సరికొత్త వీడియోను శనివారం విడుదల చేసినట్లు చిత్రబృందం పేర్కొన్నది. ఈ సినిమాలో నితిన్ కృష్ణ అనే రచయిత పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ నాలుగున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని చిత్ర నిర్మాతలు తెలిపారు.