కరీంనగర్: రిటైర్మెంట్ తర్వాత కూడా యోగా, రచనలతో సేవలందిస్తున్న మాస్టర్
రిపోర్టర్: గోపి
స్థలం: కరీంనగర్
కరీంనగర్ జిల్లాకు చెందిన డెబ్బై నాలుగేళ్ల రిటైర్డ్ పీఈటీ ఉపాధ్యాయుడు ఎస్ సంపత్ కుమార్ విశ్రాంత జీవితంలోనూ సమాజానికి సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండు వేల పదిలో ఉద్యోగ విరమణ పొందినప్పటికీ ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టకుండా ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు యాభై ఐదు పుస్తకాలు రచించానని, తెలంగాణ మాండలికాలపై కూడా పరిశోధన చేసినట్లు సంపత్ కుమార్ వెల్లడించారు.