బండేపల్లి స్కూల్లో ఎస్ఎంసి ఎన్నికల ప్రక్రియ: చైర్మన్గా వై సురేఖ ఏకగ్రీవ ఎన్నిక
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని బండేపల్లి పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా ఏకగ్రీవంగా ముగిశాయి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో జరిగిన ఈ ఎన్నికల్లో చైర్మన్గా వై సురేఖ, వైస్ చైర్మన్గా బి కావ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గురక మస్తానయ్యతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొని విజేతలను అభినందించారు.