నాగావళి వరద ముంపుతో భయంతో బతుకుతున్న శ్రీకాకుళం బూర్జ ప్రజలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీకాకుళం

నాగావళి నదికి చిన్నపాటి వరద వస్తే చాలు శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండల కేంద్రం జలమయమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా వరద గట్టు నిర్మాణం చేపట్టకపోవడంతో రాత్రింబవళ్లు భయం గుప్పిట్లోనే కాలం వెళ్లదీస్తున్నామని వాపోయారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.