దేశమ్మ దేవాలయంలో భక్తుల మధ్య ఘనంగా అన్నదానం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
నగరి మున్సిపల్ పరిధిలోని టీఆర్ కండ్రిగ నేత్రప్రదాయణీ క్షేత్రం దేశమ్మ దేవాలయంలో మంగళవారం భక్తుల సమక్షంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నామలై మెటల్ స్టోర్ నిర్వాహకులు ఆరా లోకనాథన్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా వ్యవహరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మునికృష్ణమూర్తి, ధర్మకర్త మదన్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.