దారుణంగా మారిన రహదారి: జి.కె.వీధిలో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్న వాహనదారులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలంలోని దారకొండ - గుమ్మిరేవుల ప్రధాన రహదారి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. రోడ్డు నిండా పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ దుస్థితిపై అధికారులు తక్షణమే స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.