ప్రభుత్వ తీరుపై టెక్కలిలో వైకాపా సమన్వయకర్త పేరాడ తిలక్ విమర్శలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల పరిషత్తు కార్యాలయంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన పదవీ విరమణ సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ పాల్గొని కూటమి ప్రభుత్వంపై, మంత్రి అచ్చెన్నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్ల తర్వాత వైకాపా అధికారంలోకి వస్తుందని, స్థానిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు గెలిచినా ఏమీ చేయలేరని ఆయన పేర్కొన్నారు. కార్యాలయంలో వైకాపా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రాజకీయ విమర్శలు చేయడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.