కృత్రిమ మేధస్సుకు స్పృహ లేదు: మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

కృత్రిమ మేధస్సు వ్యవస్థలకు ఎలాంటి స్పృహ లేదని, వాటికి హక్కులు కల్పించే అవసరం లేదని మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, ప్రస్తుతానికి ఏఐ సిస్టమ్స్ కు అనుభవించే శక్తి లేదని తెలిపారు. అయితే భవిష్యత్తులో స్పృహ ఉందని నమ్మదగిన ఆధారాలు లభిస్తే తన అభిప్రాయాన్ని మార్చుకుంటానని వెల్లడించారు. మానవాళి రక్షణే తమకు అత్యంత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.