బిటిఎస్ స్టార్లపై యాసిడ్ దాడికి కుట్ర, బ్రెజిల్ కన్సర్ట్లో తీవ్ర కలకలం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
బ్రెజిల్లో జరగనున్న బిటిఎస్ వరల్డ్ టూర్లో సభ్యులు వి (టెహ్యుంగ్), జిమిన్లపై యాసిడ్ దాడి చేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం రేగింది. కొందరు ఆకతాయిలు కన్సర్ట్ టికెట్లు కొని మరీ ఈ దారుణానికి పాల్పడతామని పోస్టులు పెట్టారు. దీనిపై అభిమానులు ఆందోళన చెందుతూ, హైబ్ మరియు బిగ్ హిట్ మ్యూజిక్ సంస్థలు వెంటనే స్పందించి కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.