దుమ్ముగూడెంలో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల క్షీరాభిషేకం

రిపోర్టర్: రమేష్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల కేంద్రంలో గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచి అమలు చేసిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు క్షీరాభిషేకం నిర్వహించాయి. భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇంచార్జి మానె రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల హక్కులు, రైతుబంధు వంటి పథకాలను కొనియాడారు.