దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు చేపడుతున్నామన్న కమిషనర్ రామచంద్రమోహన్

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని ఆలయ భూముల అన్యాక్రాంతంపై మీడియాలో వచ్చిన కథనానికి దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ స్పందించారు. దుర్గగుడి, పట్టాభిరామస్వామి ఆలయం, కుమారసిద్ధయ్య మఠం తదితర ఆలయాల భూముల పరిరక్షణకు, అన్యాక్రాంతమైన స్థలాలను కాపాడేందుకు న్యాయ సలహాలతో తగిన చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు.