'క్యూలైన్లలో ఏఐ, వీఆర్ వండర్': తిరుమల భక్తుల కోసం సీఎం చంద్రబాబు ఆదేశాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి భక్తుల కోసం క్యూలైన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారికి మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా ఈ ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించాలని సూచించారు. భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించే దిశగా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.