చిత్తూరు జిల్లాలో ఏనుగుల కదలికలపై పవన్కల్యాణ్ సమీక్ష

రిపోర్టర్: రాజేష్ స్థలం: చిత్తూరు

చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సోమవారం సమీక్ష నిర్వహించారు. హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏనుగుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులను రప్పించి వాటిని అడవిలోకి తరిమేసేందుకు ఆపరేషన్ చేపట్టాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణ కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్కల్యాణ్ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.