'చిన్నారులు, వృద్ధుల భద్రత మా బాధ్యత': తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, చిన్నారులు మరియు వృద్ధులు కుటుంబ సభ్యుల నుంచి వేరుపడకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక ముందస్తు జాగ్రత్తలు అమలు చేస్తున్నారు. భక్తుల రద్దీ ప్రాంతాల్లో అదనపు భద్రత కోసం ప్రతి చిన్నారి, వయోవృద్ధుల చేతికి పేరు, మొబైల్ నంబర్ వివరాలతో కూడిన చైల్డ్ ట్యాగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలతో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, అత్యవసర సమయాల్లో క్షణాల్లో స్పందించేలా పోలీస్ బృందాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.