సెప్టెంబర్ 27 ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేస్తాయి

రిపోర్టర్: రాజేష్ స్థలం: భారతదేశం

బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్‌ 27 ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు సాధారణంగానే పనిచేయనున్నట్లు వెల్లడించింది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతితో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. వరుస సెలవులు, ప్రతిపాదిత బ్యాంకు సమ్మె కారణంగా ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.