'ప్రజల ముంగిటకు వైద్య సేవలు': 913 ఆశా పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం ఆమోదం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజల ముంగిటకు మరింత చేరువ చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 913 ఆశా (సామాజిక ఆరోగ్య కార్యకర్త) పోస్టుల భర్తీకి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు మొత్తం 1,294 ఆశా పోస్టులను భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు.